వీధి కుక్క స్వైర విహారం

వీధి కుక్క స్వైర విహారం

కోనసీమ: అయినవిల్లి మండలంలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. వీరవల్లిపాలెం గ్రామంలోని వీధి కుక్క గత రెండు రోజుల నుంచి పలువురిని కరుస్తూ హల్ చల్ చేస్తుంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనాలను వెంబడిస్తూ కరుస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు.