ఆసుపత్రిలో శిశువు మృతి

ఆసుపత్రిలో శిశువు మృతి

KMR: నిజాంసాగర్‌కు చెందిన అసిఫ్, సల్మా దంపతులకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కవలలు జన్మించారు. వీరిలో ఒక శిశువు 700 గ్రాములు, మరొకరు ఒకటిన్నర కిలోలు బరువుతో పుట్టారు. తక్కువ బరువున్న శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.