వానలతో NH-65 పరిస్థితి ఇదీ!

RR: అమ్మపెట్టనివ్వదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్లు తయారైంది NH-65 హైవే పరిస్థితి. రెండేళ్లుగా రోడ్ వైడెనింగ్ పనులు జరుగుతుండగా చింతలకుంట-సుష్మ, RTC కాలనీ-హయత్‌నగర్, ORR-గండి మైసమ్మ గుడి, RFC-మెట్-ఇనామ్ గూడ వరకూ ఇరువైపులా మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. ఇటీవలే కురిసిన వానలకు మరీ ఎక్కువ అయ్యాయి. అయినా రోడ్డుకు GHMC, NHAI మరమ్మతులు చేయడం లేదని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేశారు.