అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

అనంతపురం మీదుగా బెంగుళూరు-కలబురగి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన అధికారులు శుక్రవారం తెలిపారు. రైలు ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని మీదుగా ప్రయాణించనున్నాయి. ఈనెల 5నుంచి 28వ తేదీ వరకు ప్రతి శనివారం బెంగుళూరు నుంచి రైలు(06519) కలబురగి చేరుకుంటుంది, తిరుగు ప్రయాణం ప్రతి ఆదివారం కలబురగి నుంచి (06520) బెంగళూరు చేరుతుందన్నారు.