ఓడీసీ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఓడీసీ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి: ఓడీసీ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించిన ఆయన విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. మీ-సేవా అర్జీలు, భూ సమస్యలు, మ్యుటేషన్లను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారికి సమీపంలోని గ్రామాల్లో ప్రభుత్వ అవసరాల కోసం భూమిని గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.