చెరువుల మరమ్మతులకు రూ.6.40 కోట్లు
CTR: చిత్తూరు జిల్లాలో ఇటీవల పడిన భారీ వర్షాలకు 226 చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో గండ్లు పడిన చెరువుల మరమ్మతులకు 6.40 కోట్లు మంజూరు చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జల వనరుల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర రాజు తెలిపారు. గండ్లు పడిన చెరువులకు మరమ్మత్తులు చెయ్యనున్నారు.