జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
NZB: జిల్లా యువజన, క్రీడా శాఖ కార్యాలయంలో ఈరోజు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువజన క్రీడా అధికారి పవన్ కుమార్ జెండా ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్య్ర సమరయోధులను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ సిబ్బంది సురేష్, గంగా దాస్, కోచ్ ప్రశాంత్, ఫరూక్, మురళి క్రీడా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.