నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు, బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.బి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్త విద్యుత్ లైన్లు వేసే పనులు జరగనున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో కరెంట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.