కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

SRD: జిల్లాలో రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎవరైనా వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడితే 08455- 27655, 87126 56739 నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. ఫోన్ చేసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపడతారని పేర్కొన్నారు.