వైభవంగా భద్రేశ్వర ఉత్సవాలు

వైభవంగా భద్రేశ్వర ఉత్సవాలు

SRD: తాండూర్ పట్టణంలో వెలిసిన భావిగి భద్రేశ్వర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవ ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, లంకాదహనం కార్యక్రమాలు నేటి నుంచి జరగనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. నెల రోజుల పాటు పట్టణంలో ఆద్యాత్మిక శోభ ఉట్టిపడనుంది.