ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ చేసిన కలెక్టర్

WGL: రాయపర్తి మండల కేంద్రం,పెరుకవేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్వయంగా నిర్వహించారు. లబ్ధిదారుల వద్దకు కలెక్టర్ నేరుగా వెళ్లి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి అద్దె ఇంట్లో ఉంటున్నారా, తదితర అర్హత వివరాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.