నేటి నుంచి రాష్ట్ర టెన్నీ కాయిట్ పోటీలు

SKLM: పలాస ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం, ఆదివారం రాష్ట్రస్థాయి టెన్నీ కాయిట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టెన్నికాయిట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు పి.తవిటయ్య తెలిపారు. ఈ మేరకు మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇందులో క్రీడాకారుల నైపుణ్యాన్ని అనుసరించి వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అలాగే క్రీడాకారులకు వసతి, భోజన ఉంటుందన్నారు.