చిన్న కాశీరేవులో ప్రమాదంగా ఐరన్ పైపులు

చిన్న కాశీరేవులో ప్రమాదంగా ఐరన్ పైపులు

E.G: నిడదవోలు చిన్న కాశీరేవు స్నాన ఘట్టం వద్ద ప్రమాదం పొంచి ఉంది. భక్తులు రేవులోకి దిగేందుకు గతంలో ఏర్పాటు చేసిన ఐరన్ పైపులు విరిగి మెట్లపైనే ఉన్నాయి. కింద వరకు విరిగిపోయిన ఈ ఇనుప గొట్టాల పదునైన భాగం భక్తులకు కనబడకపోవడంతో స్నానానికి దిగే సమయంలో గాయాలకు గురిచేస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి, ప్రమాదకరమైన ఈ ఇనుప శకలాలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.