ఇండిగో సంక్షోభం.. సీఈవో కీలక ప్రకటన
ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఈరోజు వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలో సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ మరోసారి స్పందించారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. శనివారం ఈ సంఖ్య వెయ్యి కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. డిసెంబర్ 10-15 మధ్య కాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందన్నారు.