పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: జుక్కల్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం అధికారులతో కలిసి జుక్కల్, మద్నూర్, డోంగ్లీ మండలాలలోని గ్రామాల్లో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు అధైర్యపడొద్దని, ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు.