'ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి'

MBNR: జిల్లా కేంద్రంలోని 21వ వార్డు వినాయక మండపంలో విద్యార్థులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావనలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. విద్యార్థులు ప్రతి పనిని ప్రేమించి భవిష్యత్తులో విజయం, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని తెలిపారు.