నేడు బూర్గంపాడులో ఎమ్మెల్యే పర్యటన
BDK: బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారని, అలాగే నూతన పిహెచ్‌సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరవుతారని అన్నారు. అనంతరం అదనపు తరగతుల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారని వెల్లడించారు.