నోయెల్ టాటా తల్లి కన్నుమూత

నోయెల్ టాటా తల్లి కన్నుమూత

టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా తల్లి సిమోన్‌ టాటా (95) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిమోన్‌ ఈ తెల్లవారుజామున మరణించినట్లు టాటా గ్రూప్‌ వెల్లడించింది. రేపు ఉదయం కొలాబాలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సిమోన్‌ టాటా.. లాక్మే సంస్థను స్థాపించారు.