పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో ఇటీవల విద్యార్థిపై హత్యాయత్నానికి కారణమైన పాఠశాల కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా ఎస్పీకి విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన కుమారుడిపై జరిగిన హత్యాయత్నంపై ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ చేపట్టి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.