బ్రిలియంట్ కళాశాలలో చోరీ.. ఇంకా దొరకని దొంగల ఆచూకీ

బ్రిలియంట్ కళాశాలలో చోరీ.. ఇంకా దొరకని దొంగల ఆచూకీ

RR: అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ 9న చోరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నప్పటికీ ముఠా ఆచూకీ లభించలేదు. దోపిడీకి వచ్చిన దొంగలు ఎక్కడ వారి ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కళాశాల ఆవరణలో సీసీ కెమెరాలోని రికార్డులను సైతం ఎత్తుకెళ్లారు.