అన్నపూర్ణ పథకంలో బియ్యం, పెన్షన్ పంపిణీ

అన్నపూర్ణ పథకంలో బియ్యం, పెన్షన్ పంపిణీ

SDPT: సిద్దిపేట వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో అన్నపూర్ణ పథకంలో పేదలకు బియ్యం, పెన్షన్ అందజేశారు. మూడ మల్లికార్జున్, సోమ వనజ శివకుమార్ దంపతుల సహాయంతో పదిమంది పేదలకు 10 కిలోల వంతున బియ్యం, రూ. 300 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. గంప కృష్ణమూర్తి, సోమ వనజ, మంకాల నవీన్ కుమార్, రాజేంద్రప్రసాద్, చకిలం రవి, సోమేశ్, మురంశెట్టి కుమార్ పాల్గొన్నారు.