'రేపు న్యాయ సేవాధికార దినోత్సవం'
WNP: న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా ఆదివారం అవగాహన ర్యాలీ, సదస్సును నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీ ప్రారంభమై బస్టాండ్ కూడలి మీదుగా తిరిగి కోర్టుకు చేరుకుంటుంది. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.