అమరచింత ఎస్సై గా స్వాతి

WNP: అమరచింత మండలం ఎస్సైగా స్వాతి నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎస్పీ రావుల గిరిధర్ శుక్రవారం తెలిపారు. స్వాతి ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, శాంతిభద్రతలను కాపాడటంలో అప్రమత్తంగా ఉండాలని ఆమెకు సూచించారు. విధుల నిర్వహణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.