ముద్దనూరు పట్టణంలో రోడ్డుపైకి మురుగు

KDP: ముద్దనూరు పట్టణంలోని అమ్మవారిశాల వెనుక వీధిలోని కాల్వలో మురుగు పారేందుకు వీలులేక నిండిపోవడంతో పొంగి పొర్లి రోడ్డుపైకి పారి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో వాహనదారులు, దుకాణదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై నిలిచిన మురుగు నీరు తొలగించాలని దుకాణదారులు, ప్రజలు కోరుతున్నారు.