మహిళల రక్షణ కోసం శక్తి యాప్: డీఎస్పీ
ELR: మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం 'శక్తి' యాప్‌ను రూపొందించిందని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఏలూరులో కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందని ఆయన విద్యార్థులకు భరోసా ఇచ్చారు. అలాగే, అత్యవసర సహాయం కోసం 181 హెల్ప్ లైను వినియోగించుకోవాలని సూచించారు.