'ప్రతి నెల వాహన మిత్ర ఇవ్వాలి'

VSP: స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతూ.. ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బుధవారం విశాఖ నగరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఉపాధి దెబ్బతినడంతో పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా నెలకు రూ. 5,000 చొప్పున ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు.