రూ.11 కోట్లతో పూడికతీత పనులు ప్రారంభించిన మంత్రి
W.G: నరసాపురం మండలం పీఎం లంకలో రూ.11 కోట్ల వ్యయంతో నల్లి క్రిక్ డ్రైన్ పూడికతీత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరద సమస్యలు తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకమని, అందుకే పనులను వేగవంతంగా పూర్తి చేసి స్థానికులకు శాశ్వత ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.