నగదుతో పాటు సరైన పత్రాలు తీసుకోవాలి: తాహశీల్దార్
BDK: స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు రూ. 50 వేలు మించి నగదుతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా సరైన పత్రాలు వెంట తీసుకెళ్లాలని మణుగూరు తాహశీల్దార్ అద్దంకి నరేష్ సూచించారు. కోడ్ అమలు విషయం చాలా మందికి తెలియదని, సాధారణంగా ప్రయాణం చేస్తే అధికారులు ఆ నగదును పట్టుకుని సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరించారు.