CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద శనివారం మంజూరైన రూ. 18,44,428 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని పేర్కొన్నారు.