VIDEO: శ్రీవారికి రూ.94 లక్షల విలువైన బంగారు పథకాలు విరాళం
TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీ విరాళాలు సమర్పిస్తుంటారు. ఇదే కోవలో తాజాగా బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం. మహాదేవమ్మ అనే భక్తురాలు స్వామివారికి విశేషమైన కానుకను అందించారు. దాదాపు రూ. 94.80 లక్షల విలువైన ఏడు బంగారు పతకాలను విరాళంగా ఇచ్చారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ పతకాలను అందజేశారు.