పత్తి లారీలో అగ్నిప్రమాదం
PLD: నాదెండ్ల మండలం గణపవరంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీలో మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్‌తో మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.