పెనుకొండలో రైతులకు మెగా చెక్కు పంపిణీ

పెనుకొండలో రైతులకు మెగా చెక్కు పంపిణీ

SS: పెనుకొండ మండల రెవెన్యూ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత నగదు రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ శ్రీరాములు ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా 5 మండలాలలో ఉన్న 42,503 మంది రైతులకు రూ. 28.73కోట్లు చెక్కును అందజేశారు. అన్నదాత సుకీభవ నగదుతో రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.