ఇంటి పన్ను వసూళ్ల కోసం వినూత్న ప్రచారం

ఇంటి పన్ను వసూళ్ల కోసం వినూత్న ప్రచారం

BPT: కర్లపాలె మండలం పెరలి గ్రామంలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఇంటి పన్ను వసూళ్ల కోసం వినూత్న ప్రచారం చేపట్టారు. తన సొంత వాహనానికి మైక్ కట్టుకొని పన్ను వసూళ్ల కోసం ప్రచారం ప్రారంభించారు. 20 పంచాయతీల్లో కేవలం 7 పంచాయతీలు మాత్రమే నూరు శాతం ఇంటి పన్నులు చెల్లించాయన్నారు. మిగిలిన 13 పంచాయతీల్లో 70 శాతం మాత్రమే వసూలు అయ్యాయని తెలిపారు. ఈ నెల ఆఖరిలోపు ప్రజలు పన్నులు చెల్లించాలని కోరారు.