పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి మృతి
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం పోలయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే అతనిని గిద్దలూరు ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.