పొదలకూరులో గంగమ్మ కొలుపు మహోత్సవం

పొదలకూరులో గంగమ్మ కొలుపు మహోత్సవం

NLR: పొదలకూరులో శ్రీ గంగమ్మ కొలుపు మహోత్సవంలో మూడో రోజైన ఆదివారం బోనాలు వైభవంగా నిర్వహించారు. డప్పు, డోలు, డీజే పాటలు, పోతురాజుల వీరంగం, యువత నృత్యాలతో పట్టణం సందడిగా మారింది. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించి పంటల సమృద్ధి, ప్రజల క్షేమం కోసం మొక్కులు తీర్చుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల నుంచి రక్షించాలని అమ్మవారిని ప్రార్థించారు.