పామూరులో నేడు మహా అంబలి పూజ

పామూరులో నేడు మహా అంబలి పూజ

ప్రకాశం: పామూరులోని స్థానిక అయ్యప్పస్వామి దేవస్థానంలో ఇవాళ మహా అంబలి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించనున్నారు. మణికంఠ స్వామిని ఐదు అశ్వాలతో కేరళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. అనంతరం అయ్యప్ప స్వామి భజన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యావన్మంది భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.