బద్వేల్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు
KDP: బద్వేల్ డిపో నుంచి శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ చైతన్య నిరంజన్ తెలిపారు. ఒక్కొక్కరికి రాను, పోను రూ.4,600, కడప నుంచి కూడా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫోన్ నెంబర్ ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు.