'పేదల ఫ్రిజ్'లకు పెరిగిన గిరాకీ..!

'పేదల ఫ్రిజ్'లకు పెరిగిన గిరాకీ..!

BHNG: జిల్లాలో ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లటి నీటి కోసం ప్రాయాసపడుతున్నారు. దీంతో ప్రజలు మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. 'పేదల ఫ్రిజ్'గా పిలిచే ఈ కుండల విక్రయాలు పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. పరిమాణాన్ని బట్టి ధర రూ.150 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. ముఖ్యంగా నల్లా (ట్యాప్) సౌకర్యం ఉన్న కుండలకు భలే డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు.