నూతన జిల్లా ప్రకటనపై సంబరాలు

నూతన జిల్లా ప్రకటనపై సంబరాలు

CTR: మదనపల్లె జిల్లా ప్రకటనపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, జనసేన రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో బుధవారం టమాటా మార్కెట్‌లో సంబరాలు నిర్వహించారు. మార్కెట్లోని రైతులకు, హమాలీలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా సీఎం చంద్రబాబు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడం హర్షణీయమన్నారు.