ఫైలు గుర్తులేదన్న అధికారి.. బాధితుడు ఏం చేశాడంటే?

ఫైలు గుర్తులేదన్న అధికారి.. బాధితుడు ఏం చేశాడంటే?

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. తన ఫైలు క్లియరెన్స్ కోసం హౌసింగ్ బోర్డు కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో విసిగిపోయాడు. అధికారులు 'గుర్తులేదు' అని సాకులు చెబుతుండటంతో, నేరుగా వారి టేబుల్‌పై బాదం కుమ్మరించాడు. 'ఇవి తింటేనైనా నా ఫైలు గురించి మీ జ్ఞాపకశక్తి పెరుగుతుందేమో' అని ఎద్దేవా చేశాడు.