కోతుల బెడదతో మామిళ్లగూడెం గ్రామస్థులు బెంబేలు
SRPT: మోతే మండలం మామిళ్లగూడెం గ్రామంలో వందల సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయి. వీటి బెడదతో రైతులు సాగు చేస్తున్న పెసర, శనగ, మినప, పంటలు నాశనం అవుతున్నాయి. ఇళ్లల్లోకి దూరి వృద్ధులను, చిన్నపిల్లలను గాయపరుస్తున్నాయని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.