ముగిసిన జిల్లా స్థాయి టోర్నమెంట్
SRD: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని నింపుతాయని పేర్కొన్నారు.