పెద్దంపేటలో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
PDPL: రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్‌ను ఓటర్ లిస్టులో పేరు లేదని ఈసీ తిరస్కరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆన్‌లైన్‌లో పేరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహించింది ఆ గ్రామ ఎన్నికలను నిలిపివేసింది.