VIDEO: వెల్దుర్తి గ్రామపంచాయతీలో కుక్కలు, కోతుల తరలింపు
KRNL: కుక్కలు, కోతుల సమస్యల గ్రామ ప్రజల ఫిర్యాదులపై స్పందించిన వెల్దుర్తి గ్రామ పంచాయతీ అధికారులు, పులివెందుల నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. వెల్దుర్తి పంచాయతీ పరిధిలో విస్తరించిన కుక్కలు, కోతులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవంబర్ 7 నుంచి ఈరోజు వరకు మొత్తం 293 కుక్కలు, 251 కోతులను ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక వాహనాల్లో తరలించినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మినాథ్ తెలిపారు.