కవితపై ఎంపీ చామల కౌంటర్

TG: మిస్ వరల్డ్ కాంపిటీషన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రతిష్టను ఎమ్మెల్సీ కవిత దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కవిత ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఉన్నాం కదా అని ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన ఆమెదని పేర్కొన్నారు.