మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ

మున్సిపల్ కార్మికులకు చీరలు పంపిణీ

MDK: రామాయంపేట మున్సిపల్ కార్మికులకు బుధవారం చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న సుమారు 30 మంది కార్మికులకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.