ఆన్‌లైన్ ట్యూషన్ పేరుతో మోసం

ఆన్‌లైన్ ట్యూషన్ పేరుతో మోసం

MDCL: ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్ పేరుతో యువకుడిని మోసం చేసిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి భూపతిరావు నగర్‌కు చెందిన హిమాన్షు వినోద్ బిహాని నుంచి మోసగాళ్లు యూపీఐ ద్వారా రూ.1,07,324 వసూలు చేశారు. మోసం తెలిసిన వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.