VIDEO: అంబటి రాంబాబు రేపు నిరాహార దీక్ష
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై నిందితులు, దాడి వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద ఈ దీక్ష నిర్వహించనున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలియజేయాలని గుంటూరు తూర్పు వైసీపీ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా తెలిపారు.