భారత్‌కు వ్యతిరేకంగా హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్?
భారత్‌కు వ్యతిరేకంగా హఫీజ్ సయూద్ కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నవంబర్-2న లాహోర్‌లోని మినార్-ఏ-పాక్‌లో హఫీజ్ ర్యాలీ జరగాల్సి ఉంది. ఈ ర్యాలీని భారత్ నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్న వేళ హఫీజ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. ఈ నిర్ణయం వెనక ఉగ్రవాదుల కొత్త కుట్ర దాగి ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.