ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్
MLG: స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు వింత వింత హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారంలో ఓ అభ్యర్థి తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చారు. BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి పై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చాడు. ఖర్చు చేసిన ప్రతి రూపాయి గ్రామస్తులకు తెలియజేస్తానని పేర్కొన్నారు.